బిగ్ బ్రేకింగ్; ఇజ్రాయిల్ ప్రధానికి కరోనా…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. దాదాపు అన్ని దేశాలకు కరోనా వైరస్ విస్తరించడంతో ఇప్పుడు ప్రజల్లో ప్రాణ భయం మొదలయింది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయలేక ఇప్పుడు అవస్థలు పడుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించినా సరే కేసులు పెరుగుతూనే ఉన్నాయి అన్ని దేశాల్లో.

పేద ధనిక, ప్రముఖుడు, సామాన్యుడు అనే తేడా లేకుండా కరోనా వైరస్ వచ్చేస్తుంది. బ్రిటన్ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు, ప్రముఖ గాయకులకు, ఆరోగ్య శాఖ మంత్రులకు ఇలా ఎవరికి చూసినా సరే కరోనా వైరస్ సోకుతుంది. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూకి కరోనా వైరస్ సోకడం ఇప్పుడు కలకలం రేపుతుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర్వాత ఆయనకు అత్యంత భద్రత ఉంటుంది.

ఆయనకు కరోనా వైరస్ సోకడం ఏంటీ అంటూ ఇప్పుడు ప్రపంచ౦ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఆయన దగ్గర ఉండే కుక్కకు కూడా వైద్య పరిక్షలు చేస్తారు. అలాంటిది ఆయనకు ఏ విధంగా వైరస్ సోకిందో ఎవరికి అర్ధం కావడం లేదు. ఆయన సన్నిహితుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కూడా ఇప్పుడు కరోనాతో పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రపంచ దేశాలు.

Read more RELATED
Recommended to you

Latest news