ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్‌.. సేవ‌ల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన ప‌నిలేదు..

-

క‌రోనా వైర‌స్‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అనేక బ్యాంకులు ఇప్ప‌టికే త‌క్కువ సంఖ్య‌లో బ్రాంచిల‌ను ఓపెన్ చేసి.. చాలా త‌క్కువ సంఖ్య‌లో సిబ్బందితో సేవ‌లను అందిస్తున్నాయి. అయితే వినియోగ‌దారుల‌కు కావ‌ల్సిన బేసిక్ స‌ర్వీసుల‌ను అందించ‌డం కోసం ఐసీఐసీఐ బ్యాంకు కొత్త ప్రయోగంతో ముందుకు వ‌చ్చింది. ఇక‌పై ఆ బ్యాంకు వినియోగ‌దారులు త‌మ త‌మ వాట్సాప్ యాప్‌ల‌లోనే ఈ బ్యాంకు సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ మేర‌కు ఐసీఐసీఐ తాజాగా ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది.

icici started whatsapp banking services for its users amid corona lock down

ఐసీఐసీఐ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన ప‌నిలేకుండానే త‌మ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ యాప్ ద్వారా ఆ బ్యాంకు సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ క్రమంలో వారు త‌మ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ ఉన్న ఫోన్‌లో 9324953001 అనే నంబ‌ర్‌ను కాంటాక్ట్‌ల‌లో సేవ్ చేసుకోవాలి. త‌రువాత వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నంబ‌ర్‌కు అందులో Hi అని మెసేజ్ పంపిస్తే చాలు.. వాట్సాప్‌లోనే ఐసీఐసీఐ బ్యాంకు సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందులో భాగంగా ప‌లు సేవ‌లు ఆ బ్యాంక్ వినియోగ‌దారుల‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి.

పైన తెలిపిన ఐసీఐసీఐ బ్యాంక్ ఫోన్‌ నంబ‌ర్‌కు వాట్సాప్‌లో balance లేదా bal లేదా ac bal అని మెసేజ్ చేస్తే వినియోగ‌దారులు త‌మ బ్యాంక్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవ‌చ్చు. అలాగే transaction లేదా stmt లేదా history అని టైప్ చేసి మెసేజ్ పంపితే వారు చివ‌రిసారిగా నిర్వ‌హించిన 3 లావాదేవీల వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ఇక క్రెడిట్ కార్డులు ఉన్నవారు limit లేదా cc limit లేదా cc balance అని టైప్ చేసి మెసేజ్ పంపితే.. క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ వివ‌రాలు తెలుస్తాయి. అలాగే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును బ్లాక్ లేదా అన్‌బ్లాక్‌ చేసేందుకు.. block లేదా lost my card లేదా unblock అని మెసేజ్ పంపించాలి. ఇక ప్రీ అప్రూవ్డ్ లోన్ల కోసం loan లేదా home loan లేదా personal loan లేదా instant loans అని టైప్ చేసి మెసేజ్‌లు పంపాలి. అలాగే ద‌గ్గ‌ర్లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం లేదా బ్రాంచ్ కోసం ATM లేదా branch అని టైప్ చేసి మెసేజ్‌లు పంపాలి. ఇక ట్రావెల్‌, డైనింగ్‌, షాపింగ్ ఆఫ‌ర్ల కోసం offer లేదా discounts అని టైప్ చేసి మెసేజ్‌లు పంపాల్సి ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Latest news