ఆదిత్య ఎల్ -1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన..!

-

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఆదిత్య ఎల్ -1 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 02వ తేదీన శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆదిత్య ఎల్-1 పై ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు వెల్లడించింది.

ఆదిత్య ఎల్ -1 సూర్యునిపై అధ్యయనం చేయనున్న విషయం తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో మరిన్ని ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్ -1 ప్రయోగం చేపట్టనుంది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనుంది. సూర్యుని పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులను గుట్టు విప్పేందుక ఆదిత్య ఎల్ -1 ప్రయోగం చేపడుతుండగా.. ఈ శాటిలైట్ ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నన లాంగ్రెట్ పాయింట్ 1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఆదిత్య ఎల్ -1 ఏడు పేరోడ్స్ ను తీసుకెళ్తున్నట్టు సమాచారం. ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర పై అధ్యయనం చేయడంలో ఇవి ఉపయోగపడనున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news