నాని సీటు చిన్నికి..యువగళంతో సెట్.!

-

కేశినేని నాని ఈ పేరు వింటేనే విజయవాడ టిడిపి అభిమానులు జేజేలు పలుకుతారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ వ్యాపార రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన కేశినేని నాని చంద్రబాబుకు ఆప్తమిత్రుడయ్యాడు .2019 జగన్ సునామీ లో కూడా టిడిపికి వచ్చిన మూడు ఎంపీ స్థానాలలో విజయవాడ కేశినేని నాని ఒకరు. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ కొంతకాలంగా నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని స్థానిక నేతలపై కినుకు వహించినా, పార్టీని గాని, అధినేత చంద్రబాబు నాయుడుని కానీ ఒక మాట కూడా అనలేదు.

ఇదిలా ఉండగా అనూహ్యంగా విజయవాడ ఎంపీ సీటును ఆశిస్తూ  నాని సొంత తమ్ముడైన చిన్ని చంద్రబాబు నాయుడుని ఆశ్రయించారు. అంతేకాకుండా తక్కువ కాలంలోనే చిన్ని పార్టీ కార్యక్రమాలలో తనదైన ప్రత్యేకముద్ర వేశారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచిన  కేశినేని నానికి టికెట్ ఇవ్వాలా లేదా ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న చిన్నికి ఇవ్వాలా, అని టిడిపి అధినేత ఆలోచిస్తుంటే “కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు”  లోకేష్ యువగళం పాదయాత్ర ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చి చెప్పిందని టి‌డి‌పిలో చర్చ నడుస్తోంది.

టిడిపి అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకి తనకి ఆహ్వానం అందలేదని కేశినేని నాని పాదయాత్రకు దూరంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న కేశినేని చిన్ని విజయవాడ లో లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ తానై ముందుండి నడిపించారు. విజయవాడలో టిడిపి సీనియర్ నేతలు ఎందరు ఉన్నా లోకేష్ పాదయాత్ర విజయవంతం చేయడానికి కేశినేని చిన్ని అహర్నిశలు శ్రమించారు.

టిడిపి అధినేతకు విజయవాడలో నానిని పక్కన పెట్టి చిన్నికి టికెట్ ఇవ్వడానికి ఈ ఒక్క కారణం చాలు కదా అని పార్టీ నేతలందరూ అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సారి విజయవాడ ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news