బీఆర్ఎస్ బలం కార్యకర్తలేనని మరోసారి రుజువైంది : కేటీఆర్

-

తెలంగాణలో ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులపై పంచాయితీ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సభ్వత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు హైకోర్టులో పిల్ వేయగా.. కోర్టు కూడా నాలుగు వారాల్లో వారిని అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

Key statement of KTR on Zainur incident

దీనికి తోడు పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఇవ్వకుండా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఇచ్చింది. ఇక తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని గాంధీ ప్రకటించడంతో ఆయనకు కౌశికరెడ్డికి మధ్య వివాదం ముదిరింది. దీంతో గురువారం బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగాయి. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ..బీఆర్ఎస్ నిజమైన బలం కేడర్ లోనే ఉందని కార్యకర్తలు మరోసారి నిరూపించారని కేటీఆర్ అన్నారు.‘నిన్న కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు.రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్లు రువ్వినా, దాడులను పోలీసులు ఆపకపోయినా ధైర్యంగా పోరాడారు’ వారికి వందనాలు అనిట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version