కౌశిక్‌రెడ్డి,గాంధీకి మ‌ధ్య ఎందుకీ వివాదం… ఏం జ‌రిగింది…!

-

తెలంగాణలో అధికార,విపక్ష పార్టీల‌ మ‌ధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏడాది కాలంగా ఈ రెండు పార్టీల న‌డుమ మాటల దాడి మరింత పెరిగింది.దీంతో ఏడాదిగా రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతున్నాయి.ఇక‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీరు కొన్నిసార్లు పార్టీకి లాభం కలిగిస్తుండగా కొన్నిసార్లు పరువు తీస్తోంది. గతంలో గవర్నర్‌పై, మహిళలపై అనుచిత వాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిపై కోర్టు, మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో క్షమాపణ చెప్పారు. తాజాగా ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ చీర కట్టుకుని గాజులు వేసుకుని తిరగాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళా విభాగం మండిపడింది.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్‌ అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్వం సాగుతోంది.

గాంధీ ఇంటిపైన ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేస్తానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటలు కాస్త కోటలు దాగి చేతల వరకు చేరుతున్నాయి. ఇటీవ‌ల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మ‌ధ్య వాదోపవాదాలు స్ధాయి దాటి దాడులు చేసుకునే వరకూ చేరాయి. అరికెపూడి గాంధీపై పాడె కౌశిక్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగుర వేస్తానని కౌశిక్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఆయన చేసిన ఈ సవాల్‌ పై అరికెపూడి గాంధీ కూడా ఘాటుగానే స్పందించారు.

నువ్వు 11 గంటల వరకు రాకపోతే.. 12 గంటలకు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ .. కౌశిక్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.కౌశిక్‌రెడ్డి రాకపోవడంతో గాంధీ తన అనుచరులతో పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గాంధీ అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గాంధీ అనుచరులు టమాటాలు, కోడిగుడ్లతో దాడిచేశారు. రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో కౌశిక్‌ బయటకు రాలేదు. గాంధీ మాత్రం కాసేపు అక్కడే బైఠాయించారు. దీంతో వారిని పంపించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

కౌశిక్‌రెడ్డి ఇంటిపై జ‌రిగిన దాడిని బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు రాజ‌కీయం చేస్తున్నారు ఆ పార్టీ నాయ‌కులు.కౌశిక్‌ రెడ్డి ఇంటి పైన దాడి చేస్తానని ముందే చెప్పి అనుచరులతో గాంధీ వచ్చినప్పటికీ వారిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని హరీష్ రావు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి పైన దాడి చేసిన గాంధీని అతని అనుచరులను అరెస్టు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ విద్రోహ,వికృత, ప్రజాస్వామిక వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక మున్ముందు ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version