మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను మంత్రులను అన్యాయంగా తిడుతున్నారని ఆయన మండిపడ్డారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలి అని కోరారు. 300 రోజులుగా రైతులు పారాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు.
ఆడవాళ్లని కూడా చూడకుండా పోలీసులు జుట్టుపట్టుకని కొట్టారన్నారు. మహిళలకు గుడికి వెళ్లే అర్హత లేదా? అని ప్రశ్నించారు. ఇన్ని అరాచకాలు కళ్ళ ముందే జరుగుతుంటే డీజీపీ ఎందుకు స్పందించడంలేదు అని నిలదీశారు. అన్ని నియోజకవర్గాల్లో రైతులకు సంఘీభావంగా నిరసన తెలుపుతాం అని అన్నారు. ప్రధాని కూడా శంకుస్థాపనకు వచ్చి డిల్లీ కంటే తలదన్నే రాజధాని నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులుకు అన్యాయం జరుగుతుంటే మౌనం వహించడం సరికాదన్నారు. దేశంలో రైతుకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని వ్యాఖ్యానించారు.