హైదరాబాద్‌లో రెండోరోజు ఐటీ సోదాలు

-

హైదరాబాద్​లో ఐటీ సోదాల కలకలం మళ్లీ మొదలైంది. బుధవారం రోజున మళ్లీ మొదలైన ఐటీ అధికారుల తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. శ్రీ ఆదిత్య, ఊర్జిత్‌, సీఎస్‌కే స్థిరాస్తి సంస్థల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

బుధవారం రోజున నగరంలో మూడు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో దాదాపు 50 బృందాలు పాల్గొన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లతో పాటు ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి అనుబంధ సంస్థలు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా తనిఖీలు నిర్వహించారు.

ఈ సంస్థలు నిర్వహిస్తున్న స్తిరాస్థి వ్యాపారానికి, అవి చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు పొంతన లేకపోవడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన అధికారులు.. ఆయా సంస్థలపై కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news