Breaking : సోను సూద్ ఇంట్లో మరోసారి ఐటీ దాడులు

రియల్ హీరో సోనూసూద్ ఆస్తులపై ఐటీ శాఖ సోదాలు వరుసగా మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఐటీ శాఖ అధికారులు… ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబైలోని ఆయన నివాసం తో పాటు…. నాగపూర్ జైపూర్ లలో ఏకకాలంలో ఐటి దాడులు జరిగాయి.

sonu sood

ఈ సోదాల్లో భారీ మొత్తంలో పన్ను ఎగవేత అధికారులు గుర్తించినట్లు సమాచారం అందుతోంది. బాలీవుడ్ నుంచి తీసుకున్న పేమెంట్లు… సోనూసూద్ వ్యక్తిగత ఆదాయం లో ఈ పన్ను ఎగవేత గుర్తించినట్లు సమాచారం అందుతోంది. అలాగే సోనూసూద్ చారిటీ పౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఐటి అధికారులు శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరించారు అవకాశం ఉంది. పన్ను ఎగవేతకు సంబంధించి ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై మరియు యు.ఎఫ్.ఒ నగరాల్లో ని… సోనూసూద్ కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధవారం సోదరులు చేసిన సంగతి తెలిసిందే.