ఇండో-టిబెటియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు రోడ్డుపై వెళ్తుండగా చిట్టి చిట్టి చేతులతో ఓ బుడతడు సెల్యూట్ చేస్తున్న వీడియో ఒకటి గత నెలలో సోషల్ మీడియాలో బాగా వైరల్అయిన సంగతి తెలిసిందే. దీన్ని చూసిన ఐటీబీపీ తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియో నెటిజన్లతో పంచుకున్న విషయం కూడా గుర్తే ఉంటుంది. అయితే ఆ బుడతడికి ఇప్పుడు ఇండో-టిబెటియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అరుదైన గౌరవం అందించింది.
ఆ బుడతడికి కస్టమ్ మేడ్ ఐటిబిపి యూనిఫాం తొడిగి సత్కరించారు మరియు తమ శిబిరంలో ఆ బుడతడు డ్రిల్ చేస్తున్నట్లుగా ఒక వీడియో చిత్రీకరించి షేర్ చేశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “హ్యాపీ అలానే ఇన్స్ పైరింగ్ అంటూ షేర్ చేశారు. ఈ వీడియో కూడా ఇంటర్నెట్ లో ఇప్పుడు జనాల హృదయాలను గెలుచుకుంటుంది. లేహ్ లోని చుషుల్ ప్రాంతానికి చెందిన ఈ పిల్లాడి పేరు నంగ్యాల్. కిండర్ గార్టెన్ విద్యార్థి. అక్టోబరులో ఐటిబిపి జవాన్లను నమస్కరించే వీడియో ను ఒక జవాన్ షేర్ చేయడంతో ఈ బుడ్డోడు ఇంటర్నెట్ సంచలనంగా మారాడు.
Salute!
Happy and inspiring again…
Nawang Namgyal, the 5 years old student of LKG salutes Indo-Tibetan Border Police (ITBP) jawans near a border village in Ladakh. #Himveers pic.twitter.com/aoA30ifbnU
— ITBP (@ITBP_official) November 15, 2020