గతంలో ఇబ్బందులున్నాయని వర్తమానాన్ని మార్చడం లేదంటే అది మీ తప్పే..!

-

జీవితంలో కష్టసుఖాలు రెండూ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదీ శాశ్వతం కాదు. ఓ రోజు కష్టం ఉంటే మరొక రోజు ఆనందం ఉంటుంది. ఏది ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో ఉండదు. కనుక దాని గురించి బాధ పడక్కర్లేదు. కానీ ఈరోజు కష్టం వచ్చింది కదా అని రేపు కూడా అలానే ఉంటుందని దానిని చేతులారా మీరు నాశనం చేస్తున్నారు అంటే అది మీ తప్పే.

 

పైగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక గతం ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానం కూడా అలానే ఉంటుంది. దానిలో కూడా ఎటువంటి మార్పు రాదు. చాలా మంది గతాన్ని మర్చి పోయి ముందుకు వెళ్లమని చెప్తూ ఉంటారు అదేమీ అంత సులభం కాదు. అయితే నిజానికి గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు సమయాన్ని కూడా మీరు అనవసరంగా వృధా చేసుకుంటున్నారు అంటే అది మీ తప్పే అని తెలుసుకోండి.

గత బాధల్ని మర్చిపోలేక పోయినప్పటికీ కూడా వర్తమానాన్ని అనవసరంగా చేతులారా పాడు చేసుకోకండి. భవిష్యత్తును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిన్న కష్టాలు ఉన్నాయి కదా రేపు ఆనందాలు ఉంటాయని పాజిటివ్ గా ఆలోచించాలి. ఎలాగూ గతాన్ని మార్చలేము కనుక మార్చలేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడకండి.

చీకటి వెళ్తేనే మన జీవితంలోకి వెలుగు వస్తుంది అని తెలుసుకోండి. పైగా ప్రయత్నం అన్నిటికంటే ముఖ్యం. నాకు రాదు నేను చేయలేను అని కాకుండా కాస్త ప్రయత్నం చేయండి. దాంతో మీరే సక్సెస్ అవ్వగలరు. కాబట్టి అనవసరంగా గతం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. కాస్త ప్రయత్నం చేసి మంచిగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళితే విజయం తథ్యం. ఈ నిజాన్ని తెలుసుకుని మీ జీవితాన్ని మార్చుకోండి బాధల నుండి బయట పడి ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news