సమంత “యశోద” మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న వరుస సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో సమంత నటిస్తున్న యశోద చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాత్రమే ఇప్పటివరకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

దీంతో ఈ సినిమా టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలుు పోషిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే తాజాగా సెప్టెంబర్ 9న సాయంత్రం 5:49 గంటలకు ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ టీజర్ అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోందని చిత్ర యూనిట్ అంటుంది. మరి నిజంగానే యశోద చిత్ర టీజర్ మరో లెవెల్ లో ఉంటుందా లేదా అనేది తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news