వ్యభిచార గృహంలో పట్టుబడిన జబర్దస్త్ నటులు…!

-

జబర్దస్త్ లో నటించే ఇద్దరు నటులు విశాఖలో వ్యభిచార గృహంలో పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. విశాఖ పట్నంలో విశాఖలో ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో జబర్దస్త్ షోలో నటిస్తున్న దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరితో పాటు నలుగురు మహిళలు, మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. వారి వద్ద నుంచి కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. దొరబాబు జబర్దస్త్ లో గత కొంత కాలంగా ఆక్టివ్ గా ఉంటున్నాడు. అతనికి మంచి పేరు వచ్చింది. ఈ తరుణంలో ఇలా అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. వారితో పాటు అరెస్ట్ అయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news