ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతాపరెడ్డి అనే పేరు మారుమ్రోగుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఇదివరకు బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది ఈ ప్రతాపరెడ్డి కావడంతో ఈ రెడ్డి గారి పేరు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు కి వ్యతిరేకంగా వైయస్ జగన్ ప్రభుత్వం 50 శాతానికి మించి బీసీలకు రిజర్వేషన్లను ఎందుకు కల్పిస్తున్నారు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో హైకోర్టు చొరవ తీసుకొని 50 శాతానికి మించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు తోనే ఎన్నికలు నిర్వహించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రతాపరెడ్డి నీ బీసీ వర్గానికి చెందిన ప్రజలు తెగ విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ ప్రతాపరెడ్డి మూలాలు చూస్తే తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుడు అని బయటపడటంతో పాటు చంద్రబాబుతో మరియు నారా లోకేష్ తో దిగిన ఫోటోలు కూడా బయటకు రావటం జరిగాయి.
ఫోటోలు అనేక వార్తలు బయటపడటంతో ప్రతాపరెడ్డి…చంద్రబాబుకి మింగుడుపడని దెబ్బ కొట్టినట్లయింది. దీంతో బీసీ వర్గానికి చెందిన ప్రజలు నాయకులు ప్రతాప్ రెడ్డి చేసిన పనికి వెనకాల చంద్రబాబు డైరెక్షన్ చేశారని బండ బూతులు తిడుతున్నారు. ఇదే తరుణంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… బీసీల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ధైర్యం చేసి జీవో తెస్తే చంద్రబాబు అడ్డుకోవటం జరిగిందని విమర్శించారు. బీసీల ద్రోహి చంద్రబాబు అని తీవ్రస్థాయిలో కృష్ణయ్య ఆగ్రహించారు.