క్యాన్సర్ బారిన పడ్డ జబర్దస్త్ ఆటో రాంప్రసాద్.. క్లారిటీ ఇదే..!

-

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇప్పటికే సుధీర్, గెటప్ శ్రీను లతో కలిసి ఎన్నో స్కిట్లు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు వీరిద్దరూ లేకపోవడంతో ఒంటరిగానే జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ టీం ను ముందుకు నడిపిస్తున్నాడు.మరోపక్క సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను సినిమాలలో అవకాశాలు దక్కించుకొని బిజీగా ఉంటే ఈయన మాత్రం జబర్దస్త్ కి పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా ఇటీవల తలపై ఒక క్యాప్ పెట్టుకొని కనిపించడంతో ఆటో రాంప్రసాద్ కు క్యాన్సర్ ఉందని, ఆయన అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

దీంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆటో రాంప్రసాద్. జబర్దస్త్ కమెడియన్ ఆర్ పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచ్ ను తాజాగా మణికొండలో ఏర్పాటు చేయగా.. బ్రాంచ్ ఓపెనింగ్ కి జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది వచ్చారు. వారిలో రాంప్రసాద్ కూడా ఒకరు. ఈ క్రమంలోనే రాంప్రసాద్ మాట్లాడుతూ..నా ఆరోగ్యం బాగా లేదంటూ.. నాకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.. నేను హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాను. ఆ కారణంగానే తలపై కాప్ పెట్టుకున్నాను అంటూ రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చారు..

ఇకపోతే సుధీర్ నటించిన గాలోడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆటో రాంప్రసాద్ హాజరు కాలేదు. ఆ తర్వాత తలకి క్యాప్ పెట్టుకున్న ఒక ఫోటోను బయటకు వదలగా ఇలాంటి రూమర్స్ వ్యక్తం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news