వర్ష జబర్థస్త్ ను వదిలిపోతుందా.! ఇక కష్టాలేనా.!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అలాగే అనసూయ మరియు రష్మి ఈ షో లను యాంకర్స్ గా ఉండి సూపర్ హిట్ చేశారు.

వీరిద్దరూ తమపై వేసే పంచ్ డైలాగ్స్ కు రెస్పాండ్ అవుతూ రియాక్షన్ ఇస్తూ షో లను మరింత రక్తి కట్టించారు.ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ గ్లామర్ ఒలకపోస్తూ నటించే వర్ష కూడా ఈ షో లకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా జబర్థస్త్ లో వర్ష-ఇమాన్యుల్ కాంబినేషన్ చాలా స్పెషల్ అయిన చెప్పాలి. ఈ ఇద్దరు స్టేజ్ మీద చేసే లవ్ ట్రాక్ కు మస్త్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు స్కిట్ లో ఉంటే. ఏదో జరిగి పోతున్నట్లు బిల్డప్ ఇస్తారు.

ఇక ఇప్పుడు వర్ష కూడా అనసూయ మరియు రష్మి లాగా షో ను వీడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  ఇమాన్యుల్ తో ప్రచారం ఎక్కువ కావటం, అలాగే మెల్లిగా సినిమా అవకాశాలు వస్తుండటం తో ఆమె షో ను వీడాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సైతం హాట్ హాట్ ఫోటోలు పెడుతోంది. ఇక వర్ష కూడా వెళ్లిపోతే షో గ్లామర్ మొత్తం పోయే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news