కృష్ణ గారు.. ఒక లెజెండరీ సూపర్ స్టార్ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో ..వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి అంటూ పేర్కొన్నారు భారత ప్రధాని, నరేంద్ర మోడీ. ఇక అటు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్. దీంతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి.