దాదాపు ముప్పై మూడు వారాలు జగన్ కోర్టు మొహం చూడకపోవడంతో సిబిఐ కోర్టు అతనిని ఆతితీవ్రంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రావాలని హెచ్చరించింది. కాబట్టి చివరికి ఈ రోజున అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు అక్రమాస్తుల కేసులో జగన్‌పై 11 చార్జిషీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఎప్పటినుండో సిబిఐ ను మోడీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు అని ఒక పుకారు ఉంది. అతనితో వైరం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ సిబిఐ కేసుల బారినపడేసరికి అదికాస్తా బలమైన నమ్మకం గా మారింది. అయితే జగన్ కు పక్కలో బల్లెం లాగా తయారైన ఈ సిబిఐ కేసుల నుండి విముక్తి పొందేలా కేంద్రం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట.
జగన్ దగ్గర 22 ఎంపీలు ఉన్న నేపథ్యంలో ఆయన తన పార్టీని ఎన్డీఏ కూటమిలో కలిపేస్తే ఈ కేసులన్నీ కొట్టివేసి లాగా తాను చూసుకుంటానని మోడీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే జగన్ అతి కీలకమైన రాజధాని తరలింపు ప్రక్రియలో కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి కఠినమైన నిర్ణయం గురించి తొందరపాటు తనంతో ఆలోచిస్తాడా అన్నది ఇక్కడ అందరినీ సందిగ్ధంలో పడేసింది. అదీ కాకుండా కేంద్రంలో మోడీ పరిస్థితి అస్సలు బాగాలేదు.
ప్రతి చార్జ్‌షీట్ లో ఏ-1 నిందితుడిగా జగన్, ఏ2 గా విజయసాయిరెడ్డి ఉన్నారు. సీఎం అయ్యాక వ్యక్తిగత మినహాయింపు నుంచి వాయిదాలు కోరుతూ వచ్చారు. అయితే.. సీబీఐ కోర్టు అనుమతించకపోవడంతో నేడు కోర్టుకు హాజరయ్యారు.