బడికి వెళ్లి చదువుకునే ప్రతి పిల్లవాడి తల్లికీ.. పదివేల రూపాయలు ఏడాదికి ఇస్తానని పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన జగన్మోహన రెడ్డి.. సీఎం అయిన తర్వాత ఆ మొత్తాన్ని 15 వేలకు పెంచారు. అలా రాష్ట్రంలో గుర్తించిన 43 లక్షల మంది తల్లులకు ఒకేసారి 6456 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి జమచేసే పథకాన్ని జగన్ ప్రారంభించారు. ఇది రాష్ట్రమంతా హర్షించే విషయం.
ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం పై ప్రజలందరి రెస్పాన్స్ ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నిజానికి జగన్ చేపట్టిన ఈ స్కీమ్ బంపర్ హిట్ గా నిలవగా ఒకపక్క పిల్లలు మరియు తల్లులు జగన్ తమకు అతి పెద్ద సహాయం చేశారని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇప్పటి వరకూ తమ ఆర్థిక పరిస్థితి కారణంగానే పిల్లలను చదివించే లేక కనీసం వారికి అవసరమైన కొన్ని చిన్నచిన్న ఖర్చులు కూడా పెట్టుకోలేక పేద ప్రజల అవస్థలు పడుతుంటే ఉచిత విద్యతో పాటు తిరిగి వారికే ఏటా 15 వేల రూపాయలు వేయడం అనేది పెద్ద విషయం అని వారంతా అంటున్నారు.
అమ్మ ఒడి పథకం మొదటిరోజు రెస్పాన్స్ అదిరిపోగా ఇంకా రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్రంలో నిరక్షరాస్యత తగ్గిపోయి ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల కూడా మన రాష్ట్ర లోని పిల్లలు ప్రపంచ దేశాలలో అన్ని రంగాల్లో పోటీపడే లాగా తయారవుతారని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.