వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ వేస్తున్న వ్యూహాలకు తెలుగుదేశం పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపిని ఆల్మోస్ట్ ఆల్ జగన్ చావుదెబ్బ కొట్టడం జరిగింది. దీంతో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పార్టీని కాపాడుకోవడానికి నానా తిప్పలు ప్రస్తుతం పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆరంభం నుండి నమ్మకంగా ఎర్రన్నాయుడు ఫ్యామిలీ ఉన్న విషయం అందరికీ తెలిసినదే. మామూలుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అటువంటిది తాజాగా ఇటీవల జగన్ విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన నిర్ణయానికి ఉత్తరాంధ్ర లో రాజకీయ సమీకరణాలు మొత్తం ఒక్కసారిగా మారిపోతున్నాయి.
మేటర్ లోకి వెళితే 2019 ఎన్నికల్లో జగన్ గాలి గట్టిగా విచినా గాని ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు ఫ్యామిలీ లో కీలకంగా రాజకీయాల్లో రాణిస్తున్న బాబాయ్ అబ్బాయిలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఇద్దరు మాత్రం ఓడిపోలేదు. ఇటువంటి నేపథ్యంలో జగన్ తీసుకున్నవిశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయానికి బాబాయ్ అబ్బాయిలు అచ్చెన్నాయుడు. రామ్మోహన్ నాయుడు ప్రాంతాల కంచు కోటకు బీటలు పడుతున్నాయి. విషయంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ విశాఖపట్టణం నీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడాన్ని తీవ్రంగా విభేదించడం జరిగింది.
కాగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా టిడిపి మద్దతు తెలిపి విశాఖపట్టణానికి నో చెబుతూ అమరావతి ప్రాంతానికి జై కొట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇప్పుడు అబ్బాయి బాబాయ్ ఇద్దరిని చీ కొడుతున్నారు గత రెండు నెలల నుండి. వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరూ మా ఓట్లు వల్ల గెలిచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అంటే మద్దతు తెలపకుండా నీచమైన రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రలో ఉండబట్టే ఈ ప్రాంతం వెనకబడి పోయిందని రాబోయే రోజుల్లో రాజకీయంగా వీళ్ళకి ఎవరు ఇక్కడ తోడు ఉండరు అని ఆ ప్రాంత ప్రజలు కామెంట్ చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో కచ్చితంగా బాబాయ్ అబ్బాయిలు అయినా రామ్మోహన్ నాయుడు, అచ్చెం నాయుడికి ఇబ్బందికర పరిస్థితులు గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.