ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవటానికి కష్టపడి పనిచేసిన వారిలో ఒకరు మోహన్ బాబు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో చాలా సన్నిహితంగా ఆయనతో ఉంటూ జగన్ రాజకీయాల్లోకి వచ్చాక అడపాదడపా సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. కాగా కుమారుడు మంచు విష్ణు వైయస్ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో వైయస్ ఫ్యామిలీ కి మోహన్ బాబు ఫ్యామిలీకి రిలేషన్ కుదిరింది. అయితే 2019 ఎన్నికల సమయంలో బహిరంగంగా వైయస్ జగన్ కి సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తన కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించి ధర్నా కూడా చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో జగన్ కి బాగా సపోర్ట్ చేసి మద్దతు తెలిపారు. జగన్ భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు.
కాగా ఇటీవల రాజ్యసభ సీటుపై మోహన్ బాబు ఆశ పడ్డారట కానీ జగన్ హ్యాండిచ్చారు అని వైసీపీ పార్టీలో టాక్. దీంతో మోహన్ బాబు తన సన్నిహితుల వద్ద…జగన్ ముఖ్యమంత్రి అవడం కోసం చాలా కష్టపడ్డాను కనీసం పార్టీ నుండి నామినేటెడ్ పదవి కానీ మరియు ఎటువంటి గౌరవం ఇవ్వకపోవడం పట్ల మోహన్ బాబు అలగటం జరిగిందట. ఇందుమూలంగానే ఇటీవల మోహన్ బాబు కొద్దిగా బిజెపికి దగ్గరవుతున్నారు అని ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. మరోపక్క వైయస్ బంధువులు జగన్ అలా చేయకుండా ఉండాల్సింది మోహన్ బాబు విషయంలో అని అంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.