తెలంగాణాలో చికెన్ కత్తి ఏడుస్తుంది…!

-

చికెన్, మన దేశంలో ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే, ప్రధానంగా ఎక్కువగా వాడేది తెలంగాణాలోనే. తెలంగాణా జీవన విధానంలో చికెన్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఏ చిన్న శుభకార్యం అయినా సరే ప్రజలు చికెన్ భారీగా ఆర్డర్ చేస్తూ ఉంటారు. దీనితో చికెన్ షాపులకు అక్కడ గిరాకి ఎక్కువగా ఉంటుంది. ఇక పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువగా ఉండేది కూడా తెలంగాణాలోనే. ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇది ఎక్కువ.

ఇక ఖమ్మం జిల్లాను ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు కూడా ఎక్కువగా తెలంగాణకు ఎక్కువగా కోళ్ళను ఎగుమతి చేస్తూ ఉంటుది. ఇప్పుడు కరోనా దెబ్బకు చికెన్ ఎవరూ తినడం లేదు. టీవీ లు చూడని వాళ్ళు కూడా కరోనా వచ్చేసింది అంటా అంటుంటే జనాలు షాక్ అవుతున్నారు. చికెన్ షాపులు అన్నీ బోసి పోతున్నాయి. ఇన్నాళ్ళు సందడి సందడిగా ఉన్న చికెన్ షాపులు ఈగలు తోలుకునే పరిస్థితి.

సరదాగా కూడా చికెన్ షాపుకి ఎవరూ రావడం లేదు. దీనికి తోడు ఇటీవల వచ్చిన ఒక వైరస్ పౌల్ట్రీ రంగాన్ని భారీగా దెబ్బ తీసింది. లక్షల కోళ్ళు తెలంగాణాలో చనిపోయాయి. దీనితో ఇప్పుడు ప్రజలు అది కరోనా అనుకుని తినడం మానేశారు. తెలంగాణా ప్రభుత్వం చెప్పినా సరే ఎవరూ తినడం లేదు. చికెన్ మొద్దు మీద కత్తి పడటం లేదు. దీనితో ఇప్పుడు తెలంగాణాలో చికెన్ కత్తి కన్నీరు పెట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news