జగన్ ఒక్క రోజు ఆదాయం 300 కోట్లు… జేసి దివాకర్ రెడ్డి సంచలనం

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత జేసి దివాకర్ రెడ్డి కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది. రాజకీయంగా ఆ ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆర్ధికంగా కూడా జేసి కుటుంబాన్ని వైసీపీ ఇబ్బంది పెడుతుంది. అయినా సరే జేసి కుటుంబం మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రోజు ఆదాయం 300 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. నిజమో అబద్ధమో తెలియదు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్న ఆయన… డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారు అని విమర్శలు చేసారు. కుప్పంను చంద్రబాబు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినా… వైసీపీ తో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారు అని ఆయన అభిప్రాయపడ్డారు.

అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు అని జేసి ఆరోపించారు. అభివృద్ధి చూసి వైసిపికి ఓటేశారని చెప్పడం అబద్ధం… అది దొంగ మాట అని ఆయన మండిపడ్డారు. అడ్వకేట్ దంపతుల హత్య లో అన్ని ఆధారాలు వున్నా విచారణ ఎందుకు లేట్ అవుతుంది అంటూ ఆయన తెలంగాణా ప్రభుత్వంను ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాంటి వారో… జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో ప్రజలకు తెలుసు అన్నారు.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...