జగన్ ని వాళ్ళే ముంచుతారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ నాయకులు అనుసరిస్తున్న విధానం చర్చనీయంశంగా మారింది. మాచర్లలో టీడీపీ సీనియర్ నేతల మీద జరిగిన దాడి వివాదాస్పదంగా మారింది. వాళ్ళు వెళ్తే కాపు కాసి దాడులకు దిగారు వైసీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన కొన్ని వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అధికార పార్టీ నేతలు దీన్ని ఎన్ని విధాలుగా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నా సరే,

ఆ వీడియో లు సొంత పార్టీ లో కూడా విమర్శలు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ చర్య కక్ష సాధింపు చర్యగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే అధికార పార్టీకి అంత లాభం. జగన్ ఏకగ్రీవం అవ్వాలి కదా అని చెప్తే, ఆ విధంగా ఏకగ్రీవం చేస్తే మునిగిపోయేది వైసీపీ. పోటీ లేకుండా నామినేషన్ పత్రాలు చించి దాడులు చేయడం అనేది ఎంత మాత్రం భావ్యం కాదు.

ఇప్పుడు చేసే చర్యలు క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత టీడీపీ మీద విమర్శలు చేస్తున్నా సరే దోషిగా వైసీపీనే కనపడుతుంది. కాబట్టి వైసీపీ నేతలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీడియా అందుబాటులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు పార్టీకి చెడ్డ పేరు తీసుకుని వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. పార్టీ బలంగా ఉన్నప్పుడు ఇవి ఇబ్బంది పెడతాయి.

జగన్ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అవి పార్టీకి బలం అవుతుంటే ఇలాంటి చర్యలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం పార్టీనే. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించి ముందుకి వెళ్ళాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇలాంటి చర్యలు మాత్రం జగన్ నెత్తిన భారమే.

Read more RELATED
Recommended to you

Latest news