ఆ రెండు జిల్లాలు జగన్ ని భయపెడుతున్నాయా…?

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ప్రతీ రోజు కూడా 50 కేసులు తగ్గకుండా నమోదు అవుతున్నాయి. తెలంగాణా కంటే అత్యంత వేగంగా కరోనా కేసులు నమోదు కావడం మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగించే అంశం. గుంటూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో కేసులు ప్రతీ రోజు కూడా 20 పైగా నమోదు అవుతున్నాయి. దీనితో అసలు ఈ పరిస్థితి చూసి జగన్ లో కూడా ఆందోళన మొదలయింది.

ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రెండు జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసులు ఎందుకు ఎక్కువ నమోదు అవుతున్నాయి అనే దాని మీద క్షేత్ర స్థాయిలో ఆరా తీసినా సరే ఫలితం ఉండటం లేదు. కేసులు ప్రతీ రోజు కూడా ఈ స్థాయిలో నమోదు కావడం మరింత కంగారు పెడుతుంది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర అధికారుల బృందం పర్యటనలు చేస్తుంది.

ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తమ నివేదికలను అందిస్తున్నారు. వేలాది మందిని క్వారంటైన్ చేసారు, లాక్ డౌన్ కంటే కఠినం గా కర్ఫ్యూ ని అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. అయినా సరే ప్రతీ రోజు కేసుల సంఖ్యలో మార్పు రావడం లేదు. కేంద్రం కూడా ఈ రెండు జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.

చాలా మందికి ఇక్కడ కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. జగన్ కూడా కరోనా అనుమానితులు అందరికి పరిక్షలు చెయ్యాలని సూచనలు చేస్తున్నారు. అధికారులు కూడా జలుబు ఉన్నా దగ్గు ఉన్నా సరే క్వారంటైన్ కి రావాలని సూచనలు చేస్తున్నారు. పరిస్థితిలో ఇప్పట్లో మార్పు వచ్చే విధంగా కనపడటం లేదు. ఈ రెండు జిల్లాలు పూర్తిగా మునిగిపోయి ఉన్నాయని టీడీపీ నేతలు కూడా అంటున్నారు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version