జగన్ శుభవార్త..ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం !

-

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీలు, కలెక్టర్లు పాల్గొన్నారు.  ఇళ్ల పట్టాల అంశంపై సీఎం జగన్ మాట్లాడుతూ 94 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయ్యిందని మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. టిడ్కోలో పంపిణీ చేయాల్సి ఉన్న సుమారు 47వేల ఇళ్ల పట్టాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి వెంటనే పంపిణీ చేయాలి అని ఆయన అన్నారు.

jagan

అర్హులైన వారికి కచ్చితంగా ఇళ్లపట్టాలు ఇవ్వాలని, కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసరమైన చోట వెంటనే భూమిని సేకరించండని అన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద తొలివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామని ఇళ్లనిర్మాణం జరగడానికి వీలుగా లే అవుట్‌లో బోరు, కరెంటు సౌకర్యం ఉండాలని అన్నారు. ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని, ఇళ్ల  నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్‌ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్‌కార్డుల జారీ ఈ పనులన్నీకూడా ఏప్రిల్‌ 10లోగా పూర్తికావాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version