ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్

-

లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో ఆర్ధిక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్పుడు ఆర్ధిక నష్టాలు ఎదుర్కోలేక ఖర్చుల భారం భారీగా తగ్గించుకునే పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు విధించాయి. ఏపీ తెలంగాణాలు కూడా అలానే కోతలు కోసి తమ మీద భారాలు తగ్గించుకున్నాయి. అయితే ఆ కోతలను ఏపి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్నది.

ఇప్పటికే అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకి క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కూడా పెండింగ్ లో ఉన్న జీతాలు, డీఏ బకాయిలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు సమీక్షను నిర్వహించారు. అనంతరం బకాయిల మీద జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఏతో సహా పెండింగులో ఉన్న జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొత్తం ఐదు విడతలుగా పెండింగ్ లో జీతాలను చెల్లించాలని అధికారులు యోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version