ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి మధ్యలో చదువు ఆపేయకుండా ఉన్నత చదువులు చదివించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాలను ఇస్తోంది.
2022-2023 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల అందరిని ఈ విద్యా సంవత్సరంలో (2023-24) తిరిగి కాలేజీలలో చేర్పించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రణాళికను అమలు చేసింది. దాని ఫలితంగా ఫెయిల్ అయిన వారిలో 76, 603 మంది విద్యార్థులు తిరిగి కాలేజీలలో చేరారు. గత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు మధ్యలో చదువు ఆపకుండా తిరిగి కాలేజీలలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.