ఏపీలో పెన్షన్ లబ్ది దారులకు జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్ ను ఓచోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు జగన్ ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒకచోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
చాలా సులభంగా పింఛన్ ను మార్చుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనున్నారు.