వరద బాధితులకు జగన్ శుభవార్త.. వారికి రూ.25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం

-

వరద బాధితులను అదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని..వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు ఇవ్వాలని ఆదేశించారు. వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా.. 104 నంబర్‌కు సమాచారం ఇవ్వమని ప్రజలను చైతన్యం చేయాలన్నారు.104కు ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే అధికారులు స్పందించి… బాధితులకు తోడుగా నిలవాలన్నారు.

ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలని.. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారని.. మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలని.. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండాలని ఆదేశించారు.

అలాగే రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాలని పిలుపునిచ్చారు. విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి… మిగిలిన వారిలో ధైర్యం నింపాడానికే ఈ చర్యలు అని చెప్పారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news