ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్య,లో ఏపీ ప్రభుత్వ౦ నివారణ చర్యలను ముమ్మరం చేసింది. కరోనా వైరస్ తీవ్రత పెరగడం తో ఇప్పుడు అధికారులను క్షేత్ర స్థాయిలో సిఎం జగన్ అప్రమత్తం చేసారు. కరోనా కట్టడికి వాలంటీర్ సేవలను కూడా ఆయన వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
గ్రామ స్థాయిలో కరోనా కట్టడి చేయడానికి వాళ్ళతో ఉపయోగం ఉంటుంది అని భావిస్తున్న జగన్ సర్కార్… వాళ్ళను ప్రతీ ఇంటికి పంపించి సర్వే చెయ్యాలని భావించారు. గ్రామ, నగర, పట్టణ ప్రాంతాల్లో ఈ సర్వే ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంది. ఇది పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఎవరు అలసత్వం ప్రదర్శించినా సరే తప్పించాలి అని భావిస్తుంది.
ఎవరిని కూడా ఉపేక్షించవద్దని జగన్ కీలక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడే వారిని, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు పట్టణాల్లో చేపడుతున్న ఇంటింటి సర్వేకు కొందరు వలంటీర్లు దూరంగా ఉంటున్నారనే సమాచారం జగన్ సర్కార్ కి అందింది. దీంతో సర్వేలో పాల్గొనని వార్డు వలంటీర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తో వాళ్ళు షాక్ అయ్యారు.