రాజకీయాలలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు. అటువంటి అనుభవం కంటే కొద్ది సంవత్సరాలు వయసు కలిగిన నాయకుడు వైఎస్ జగన్. ఇద్దరికిద్దరూ ఆంధ్ర రాజకీయాల్లో నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడటం జరిగింది. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రత్యర్థిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ విషయంలో మాత్రం ఆ విధంగా తీసుకోలేకపోవడం తో పాటుగా లేత వయసు కలిగిన కుర్ర నాయకుడు కాబట్టి రాజకీయాల్లో పెద్దగా రాణించడం కష్టమని అనుకున్నారట.
కాగా సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రావడంతో…చంద్రబాబు మరియు జగన్ గ్రాఫ్ పరిశీలిస్తే జగన్ చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నట్లు స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ అంశంలో జగన్ తీసుకున్న పార్టీ పరమైన నిర్ణయం…అనగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ నిర్ణయం…చంద్రబాబుని నైతికంగా రాజకీయంగా బీసీల దృష్టిలో దెబ్బ కొట్టినట్లయింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టిడిపి ఏపీ లో అట్టర్ ఫ్లాప్ ఫలితాలు రావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.