ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

-

ఏపీ రైతులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో లక్షల మంది ఏపీ రైతులకు లబ్ది చేకూరనుంది.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తో ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని ప్ర‌క‌టించారు. లేని విభేదాల‌ను ఉన్న‌ట్టు మీడియా సృష్టిస్తోంద‌ని అస‌హనం వ్య‌క్తం చేశారు. సీఎం జ‌గ‌న్ తో కూడా నెల్లూర్ జిల్లా బాధ్య‌త‌ల గురించి మాత్ర‌మే చ‌ర్చించిన‌ట్టు వెల్ల‌డించారు. వైసీపీ నేత‌లు అంద‌రూ ఒకే తాటి పై ఉన్నార‌ని ప్ర‌క‌టించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిల్‌కుమార్‌తోపాటు నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పోరాటం చేశామని తెలిపారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న అనిల్‌తో కలిసి జిల్లా అభివృద్ధికి కృషిచేశామని చెప్పారు కాకాణి గోవర్ధ న్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news