ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయినటువంటి ఇండ్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. మరి ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫీల్డ్ స్టాఫ్, అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోచ్చు. ఇక దరఖాస్తు వివరాల లోకి వెళితే… స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

వయస్సు విషయానికి వస్తే.. మినిమమ్ 35 ఏళ్ళు ఉండాలి. 65 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు. ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఈ / బీ.టెక్, ఎంబీఏ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 26, 2022.

నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1GuXgog4CroRDnJ7HiK6gxGEcztPRSsrb/view

Read more RELATED
Recommended to you

Latest news