గ్రామ పంచాయతీలకు జగన్ సర్కార్ శుభవార్త

-

గ్రామ పంచాయతీలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రూ. 1800 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న ‘నరేగా’ బిల్లుల చెల్లింపు ను వెంటనే చెల్లించేలా సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నరేగా నిధులతో నిర్మించే భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. సిమెంటు కొరత రాకుండా.. సిమెంట్ కంపెనీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటామన్నారు. సిమెంటు సరఫరా విషయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమిస్తున్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

క్లాప్ మిత్రులకు పెండింగ్ జీతాలు చెల్లింపులు జరుపుతామన్నారు. జగనన్న కాలనీలకు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం.. కులాయి కనెక్షన్లు అందిస్తామన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ.1030 కోట్లకు టెండర్లు పిలువబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు. ఆర్అండ్ బి తరహాలోనే పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం బిల్లులను బ్యాంకుల ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు. పంచాయతీరాజ్ శాఖ లో జరిగే పనులకు నిధుల కొరత లేదన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version