వైద్య శాఖలో 2,588 పోస్టులు భర్తీ చేస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని.. నిరుద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైద్యశాఖ లో పోస్టులను సృష్టించి మరీ.. భర్తీ చేసేందుకు సర్కార్‌ ముందడుగుల వేసింది. ప్రజా రోగ్యానికి పెద్దపీట వేస్తూ ఏపీ వైద్య విధాన పరిషత్‌ లో 2,588 పోస్టులను సృష్టిస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో, పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. దీనిపై త్వరలోనే నోటిపికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 560 గ్రేడ్ 2 అంగన్ వాడి సూపర్వైజర్ పోస్టులు పరిస్థితికి వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడనుందని… రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 40 సంవత్సరాల నుంచి 50 వరకు పెంచినట్లు కూడా ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news