రాజధాని పై జగన్ వ్యూహాత్మక నిర్ణయం..!

ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇరు నేతలకి  జగన్ మోహన్ రెడ్డి భారీ షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాజధాని విషయంలో జగన్ ని ఇరుకున పెట్టడానికి ఇరు పార్టీల నేతలు అమరావతి వేదికగా రచిస్తున్న వ్యుహాలకి చెక్ పెట్టడానికి జగన్ ఓ వ్యూహాన్ని సిద్దం చేసి ఉంచారట. ఈ తాజాగా వ్యూహంతో చంద్రబాబు, పవన్ లు కంగుతినడం ఖాయమంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏమిటా వ్యూహం..

జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్న అల్లర్లను అదుపు చేయడానికి అనుసరిస్తున్న తాజా వ్యూహం అమరావతిని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడమే అంటున్నారు పరిశీలకులు. వారి అంచనాల ప్రకారం జగన్ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజధానిని తరలించడం లేదని , అమరావతి రాజధానిగా కొనసాగుతుందని అయితే పాలన కేంద్రీకరణ మాత్రం జరుగుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది

ఇదిలా ఉంటే అమరావతి ప్రాంతంలో వైసిపి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదు. జగన్మోహన్ రెడ్డి  వ్యూహంలో భాగంగానే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఈ ప్రాంతాన్ని మినహాయించినట్టుగా తెలుస్తోంది. అమరావతిని  నగరపాలక సంస్థగా గా చేయడానికి గుంటూరు జిల్లాలో సుమారు 75 ఎంపీటీసీ లను వారి గ్రామ పరిధిలో ఉన్న పంచాయతీలను రద్దు చేయాల్సి ఉంటుంది అయితే ఈ పరిధిలో ఉన్న దాదాపు రెండు లక్షల మంది గ్రామీణ ఓటర్లు తర్వాత పట్టణ ఓటర్లు మార్పు చెందుతారు.

అమరావతి  లోని తుళ్లూరు మండలం లో ఉన్న 18 రెవెన్యూ గ్రామాలు, అలాగే 16 గ్రామ పంచాయతీలు మరియు ,నాలుగు రెవెన్యూ గ్రామాలు తాడేపల్లి మండలం లోని రెండు రెవెన్యూ పంచాయతీ గ్రామాలు మంగళగిరి మండలం లోని 7 పంచాయతీలు 4 రెవిన్యూ గ్రామాల పరిధిలోని తొమ్మిది గ్రాములు కలిపి రాజధాని అమరావతి పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ గా చేయడానికి గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది ప్రతిపాదనలు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.