ఫేక్ ఫోటోలతో సేల్ఫీ ఛాలెంజ్ అంటాడని టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గతంలో ఓ ముసలాయన ఉండేవారు. టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉండేవా. దోచుకో, దాచుకో, తినుకో అన్నది చంద్రబాబు విధానం అంటూ ఫైర్ అయ్యారు. ఎలాంటి వివక్ష, లంచాలు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి.
ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశాడా.? అని నిలదీశారు. టిడ్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి చంద్రబాబు ఫేక్ ఫోటోలు దిగుతాడని ఆగ్రహించారు. అక్కడికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ అని అంటారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలో దిగడం కాదు చంద్రబాబు. ఒక అబద్ధాన్ని వంద సార్లు నిజమని చెప్పి ప్రజలను నమ్మి్స్తున్నారు. నిజం ఏంటో ప్రజలకు తెలుసు, అందుకే నిజాలను దాస్తున్నారని నిప్పులు చెరిగారు సీఎం జగన్. సెల్ఫీ దిగే నైతికత, పాలన గురించి ఇంటికి స్టిక్కర్ వేసే దైర్యం ఉందా..అని సవాల్ విసిరారు సీఎం జగన్.