బొత్స సత్యనారాయణ తో సెన్సేషనల్ స్కెచ్ వేసి అద్భుతంగా అమలు చేసిన వైఎస్‌ జగన్ ..!!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకు శత్రువు లేకుండా తనదైన శైలిలో వ్యూహాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సీఎం వైఎస్‌ జగన్. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని విర్రవీగే చంద్రబాబుకి 2019 ఎన్నికల్లో భారీ దెబ్బ కొట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు జగన్. ప్రతిపక్ష హోదా లేకుండా చేసే అవకాశం ఉన్నా గాని అలా చేయకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి స్థానంలో చంద్రబాబుని కూర్చోబెట్టి ఆయన హయాంలో జరిగిన అవినీతి మొత్తం అంతా బయట పెడుతున్నాడు.

కాగా ఇక తాను తీసుకునే నిర్ణయాల విషయంలో సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ తో సెన్సేషనల్ స్కెచ్ వేసి మరి నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాడు వైఎస్‌ జగన్. సాధారణంగా రాజకీయాల్లో ఏదైనా నిర్ణయం అమలు చేయాలంటే ఒక్కో పార్టీ ఒక్కో విధంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అయితే ఏదైనా కీలక అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు తన అనుకూల మీడియాకు లీకు ఇచ్చి వార్త రాయిస్తుంది.

అది ప్రజల్లోకి వెళ్లి చర్చ జరిగిన తర్వాత దానిపై ముందుకి వెళ్లాలా వద్దా అనే నిర్ధారణకు వస్తుంది. అయితే జగన్ మాత్రం ఏదైనా తీసుకునే నిర్ణయాల విషయంలో…, ముందుగా మీడియా ముందు మాట్లాడే నాయకులలో కీలక నాయకుడు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు విషయం చెప్పి లీకులు ఇస్తున్నారు. అమరావతి విషయంలో వరదల సమయంలో బొత్స సత్యనారాయణ చేత మాట్లాడించి తాజాగా ఇటీవల మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే తరుణంలో ఇటీవల ఎన్డీఏలో కలుస్తున్నట్లు వచ్చిన వార్తల గురించి ముందుగా బొత్స సత్యనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీఏలో చేరతామని స్పష్టంచేశారు. దీనిపై పార్టీ వైఖరి ఏమిటో ప్రకటించక ముందే బొత్స తన అభిప్రాయం వెల్లడించారు. గతంలోనూ అమరావతి రాజధాని గా పనికిరాదు అన్ని వ్యాఖ్యలు బొత్స సత్యనారాయణ ఒకటికి రెండు సార్లు చేసిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. రీసెంట్ గా బొత్స ఎన్డీఏ లోకి వెళ్తే తప్పేంటి..? అంటూ మాట్లాడుతూ తన అభిప్రాయంగా వెల్లడించారు. మొత్తం మీద చూస్తే రాబోయే రోజుల్లో వైఎస్‌ జగన్ ఎన్డీఏ లోకి వెళ్ళటం గ్యారెంటీ అన్నట్టు బొత్స సత్యనారాయణ మాటలు బట్టి అర్థమవుతుంది. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version