జగన్ వీరికి భూములిచ్చాడు.. వారివి లాక్కున్నాడు..!

-

ఏపీ కేబినెట్ మీటింగ్ లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలన నిర్ణయాలతో పాటు భూ కేటాయింపులపైనా చర్చించారు. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను తిరిగదోడారు. ఇందులో భాగంగా కొన్ని ప్రభుత్వ సంస్థలకు భూమలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర విపత్తుల సహాయ కార్యక్రమాలకు ఉపయోగపడే సంస్థకు 39.23 ఎకరాల భూమిని కేటాయించాలని తీర్మానం చేశారు. అలాగే రైల్వే డిపార్టుమెంట్‌కు కూడా భూమి ఇవ్వాలని నిర్ణయించారు. దీనితో పాటు రేణిగుంట విమానాశ్రయానికి భూమి అప్పగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇదే సమయంలో గత ప్రభుత్వం.. ఆంధ్రజ్యోతి సంస్థకు తక్కువ ధరకు కట్టబెట్టిన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. విశాఖ పట్నంలో గత ప్రభుత్వం ఆంధ్రజ్యోతి సంస్థకు చెందిన ఆమోద పబ్లికేషన్స్ కు భూములు అక్రమంగా కేటాయించిందని కేబినెట్ అభిప్రాయపడింది.

విశాఖలోని పరదేశ్‌ పాలెంలో ఆమోద పబ్లికేషన్‌కు ఏ ఆమోదం లేకుండా చంద్రబాబు 1.50 ఎకరాల భూమిని కేటాయించారని కేబినెట్ అభిప్రాయపడింది. రిజిస్ట్రర్‌ విలువ రూ.7.50 కోట్లు అయితే రూ.50.05 లక్షలకు కేటాయించారని తెలిపింది. బయట మార్కెట్‌లో రూ.25 కోట్లు విలువ ఉంటుందని వివరించింది.

వీటితో పాటు పలాసలో సుమారు రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రి కోసం ప్రభుత్వం పోస్టులు మంజారు చేసింది. రిసెర్స్ సెంటర్‌లో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ పోస్టులు మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news