ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులు సంచలనంగా మారాయి. అయితే ఇది చంద్రబాబు చేయిస్తున్న దాడులేనని వైసీపీ వారు, జగన్ చేయిస్తున్నారని టీడీపీ సహా మిగతా పార్టీల వారు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చేయించినా అప్రదిష్ట మాత్రం ప్రభుత్వానికే. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడింది. హిందువులు దేవతగా భావించే గోవులకు గోపూజా మహోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారు.
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ మహోత్సవం జరుగుతోంది. నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) జరగనుంది. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్ 11.25 గంటలకు నరసరావుపేట మున్సిపల్ స్టేడియం చేరుకుని వివిధ స్టాళ్ళు పరిశీలన అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొననున్నారు. ఇక పూర్తీ అయ్యాక మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు జగన్.