నేడు విశాఖలో జగన్ పర్యటన..షెడ్యూల్ ఇదే

ఆంధ్ర ప్రదశ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  నేడు విశాఖ జిల్లా లో పర్యటించనున్నారు. ఈ సందర్భం గా  విశాఖ నగరం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో బాగంగానే నేడు  సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ వెళ్తారు. విశాఖ NAD జంక్షన్‌లో… ఫ్లైఓవర్‌, VMRDA అభివృద్ధి చేసిన ఆరు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు సిఎం జగన్.

ఆ తర్వాత విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం ఉడా పార్క్‌తోపాటు GVMC అభివృద్ధి చేసిన మరో నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. ఇవాళ  రాత్రి ఏడు గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి గన్నవరం చేరుకుంటారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.