రేపు జగనన్న తోడు స్కీమ్ ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. జగనన్న తోడు స్కీమ్ లో భాగంగా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల రుణం ఇప్పించనుంది ప్రభుత్వం. పది లక్షల మంది లబ్దిదారులకు జగనన్న తోడు స్కీమ్ కింద రుణం ఇప్పించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను ప్రభుత్వం గుర్తించింది.
సుమారు 3.60 లక్షల దరఖాస్తుల్ని వివిధ బ్యాంకులకు పంపారు అధికారులు. గుర్తించిన చిరు వ్యాపారులకు రేపు జగన్ సర్కార్ గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. రేపటి జగనన్న తోడు స్కీమ్ కు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మంత్రులకు ఆహ్వానం పంపారు. కొండపల్లి బొమ్మలతో వినూత్నంగా జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పారు అజయ్ జైన్. చెక్కతో ఆహ్వాన పత్రిక రూపొందించి మరీ మంత్రులకు అజయ్ జైన్ అందచేశారు.