ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ఈ నెలాఖరు నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పేరుతో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తమ పరిధిలోని రోగులను ANMలు, వాలంటీర్లు గుర్తించి మెడికల్ క్యాంపునకు తరలిస్తారు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు వారిని పరిశీలించి మందులు అందజేస్తారు. అవసరమైన వైద్య సిఫార్సులు చేస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వం త్వరలోనే జీవో ఇవ్వనుంది.
కాగా రూ. 118 కోట్ల ముడుపుల కేసులో చంద్రబాబుకు ఐటి నోటీసులపై మంత్రి రోజా ట్విట్టర్ లో స్పందించారు. ‘ఈ కేసులో ధైర్యంగా ఆయన విచారణ ఎదుర్కొంటారా? లేక బావమరిదిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా? రామోజీల మంచం ఎక్కుతారా? అచ్చన్నల రమేష్ ఆసుపత్రిలో చేరతారా? విజయ్ మల్యాల విదేశాలకు పారిపోతారా? ఇవన్నీ కాకుండా ఇప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటారా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు.