జగన్ పై దాడి కేసులో నేడు హైకోర్టులో విచారణ

-

ఆంధ్రప్రదేశ్ శాసన సభ పక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి సంబంధించిన కేసుని హైకోర్టు నేడు విచారణ జరపనుంది. దాడి ఘటన అటు ప్రభుత్వానికి , ఇటు ప్రతిపక్షానికి తీవ్ర ఇబ్బంది కర వాతావరణాన్ని తలపించింది. జగన్ పై దాడికి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు టీమ్ ని ఏర్పాటు చేశారు. దీంతో పూర్తి వివరాలను సీల్డ్ కవర్లో పోలీసుల..వివరాలను అడ్వొకేట్‌ జనరల్‌ నేడు హైకోర్టుకు సమర్పించనున్నారు. వైసీపీ అభిమానే తనపై దాడి చేయడం వెనుక ఉన్న కుట్రకోణంతో పాటు, అసలు వైసీపీకి చెందిన వ్యక్తేనా? కాదా ? అనే విషయాన్ని సైతం పోలీసులు నిశితంగా దర్యాఫ్తు చేసినట్లు పేర్కొన్నారు.

తెదేపా ప్రభత్వం వైసీపీ అధినేతను కావాలనే తుద ముట్టించేందుకు హత్యాయత్నం చేస్తున్నారని ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు సార్లు రెక్కి నిర్వహించారని సైతం ఆరోపించింది. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న పోలీసులు నిందితుడు శ్రీనివాస్ పూర్తి వివరాలను, దాడికి పాల్పడ్డ విషయాలను సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version