పాడి రైతులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. పాల సేకరణ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జగనన్న పాలవెల్లువ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా ఐదోసారి పాల సేకరణ ధరలను పెంచింది.
లీటర్ కు గరిష్టంగా గేదె పాలపై రూ. 3.37, ఆవు పాలపై రూ. 1.73 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.31, ఘన పదార్థాలపై రూ.12 మేర సేకరణ ధర పెరిగింది. ఈ పెంపు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గురువారం నుంచి వర్తించనుంది. దీని ద్వారా 40,000 మంది రైతులకు అదనంగా లబ్ధి చేకూరనుంది. గత రెండేళ్లలో ఇప్పటికే నాలుగు దఫాలు పాల సేకరణ ధరలను పెంచగా తాజా పెంపుతో ఐదోసారి కి చేరుకుంది.