దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలు తగ్గించేందుకు జగన్‌ కీలక నిర్ణయం

-

దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే.. దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను నియంత్రించేలా దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీ చేశారు. దేవాలయ ప్రాగంణంలోని లైసెన్స్ కలిగిన షాపుల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరిగేలా చూడాలని ఈవోలకు ఆదేశించారు.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

కొబ్బరి కాయలు, పూలు, పళ్లు, తినుబండారాల ధరలను ఈవోనే నిర్దేశించాలని స్పష్టం చేశారు. దుకాణదారులతో చర్చించి ధరలను నిర్ధారించాలని సూచనలు చేశారు. దేవాలయాలకు వచ్చే భక్తులతో ఎలా వ్యవహరించాలన్న అంశం పైనా దుకాణదారులకు అవగాహన కల్పించాలని పేర్కొంది దేవదాయ శాఖ. భక్తులతో దురుసుగా ప్రవర్తించినా.. ఎక్కువ ధరలకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామనే విషయాన్ని టెండర్, ఆక్షన్ నిబంధనల్లో పొందుపరచాలని స్పష్టం చేసింది దేవదాయ శాఖ.

దేవాలయాల సమీపంలోని ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకునే స్టాళ్లల్లోనూ ధరల నియంత్రణపై దృష్టి సారించాలన్న దేవదాయ శాఖ. ప్రైవేట్ స్టాళ్లల్లో ధరల నియంత్రణకు పౌర సరఫరాల శాఖ సాయం తీసుకోవాలని కమిషనర్ సూచనలు చేసింది. పూర్తి స్థాయి పర్యవేక్షణ నిమిత్తం విజిలెన్స్ వింగ్ ఏర్పాటు చేసుకోవాలని దేవదాయ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news