వేసవిలో రాగి మాల్ట్ బటర్ మిల్క్ ని తీసుకుంటే చల్లగా ఉంటుంది..!

-

వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. అటువంటప్పుడు చలవ చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. మీ బాడీని మీరే కూల్ చేసుకుంటూ ఉండాలి. వేసవికాలంలో ఎక్కువ మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తీసుకోకూడదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం, ఎక్కువ నీళ్ళు తీసుకోవడం, శరీరాన్ని చల్లగా మార్చే ఆహారపదార్థాలను తీసుకోవడం లాంటివి చేయాలి.

 

నిజానికి రాగి మాల్ట్ బట్టర్ మిల్క్ కూడా మిమ్మల్ని కూల్ చేస్తుంది వేడిని తగ్గిస్తుంది. వేసవి కాలంలో దీనిని తీసుకోవడం వల్ల మీరు ఎనర్జీని పొందొచ్చు. అలానే రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మీరు రాగిని బటర్ మిల్క్ తో పాటు కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీనిని తయారు చేసుకోవడానికి పెద్దగా సమయం కూడా అక్కర్లేదు. 15 నిమిషాల్లో మీరు తయారు చేసుకు తీసుకోవచ్చు. అయితే రాగి మాల్ట్ డ్రింక్ ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం.

కావలసిన పదార్థాలు:

రాగిపిండి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్లు
మజ్జిగ
కరివేపాకు
ఉప్పు
జీలకర్ర పొడి
ఇంగువ
తరిగిన ఉల్లిపాయ ముక్కలు
కొత్తిమీర
మూడు కప్పుల నీళ్లు

తయారు చేసే పద్ధతి:

రెండున్నర కప్పులు నీళ్లని వేడి చేయండి. అవి మరిగాక మిగిలిన అరకప్పు నీళ్ళల్లో రాగి పిండి మిక్స్ చేయండి. ఈ పిండిని బాగా కలిపి ఉండలు లేకుండా చూసుకోండి. ఒక్కసారి నీళ్ళు మరిగిన తర్వాత ఈ రాగి పిండి నీళ్లను అందులో వేసేయండి. రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉంచిన తర్వాత స్టవ్ కట్టేయండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ వేసి మొత్తం అన్ని పదార్థాలను వేసుకోండి తర్వాత మిక్సీ పట్టి.. ఐస్ క్యూబ్స్ ని వేసుకుని చల్లగా దీనిని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news