ఈ నెల 6న కడప జిల్లాలో జగన్ పర్యటన

-

BREAKING : ఈ నెల 6 సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మరోసారి కడప లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం లో ఈ నెల 6 న ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఇక ఈ నెల 6వ తేదీన 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు సీఎం జగన్‌.

11.40 – 12.10 వరకు కడప అమీన్‌ పీర్‌ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 12.25 – 12.45 కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news