పుష్ప-2 నుంచి అప్డేట్‌ ఇచ్చిన జగపతిబాబు

-

 

ఫ్యామిలి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో ” జగపతి బాబు “. విభిన్న పాత్రల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న జ‌గ‌ప‌తి బాబు… లెజెండ్ సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే, పుష్ప2లో నటిస్తున్నట్లు స్వయంగా జగపతిబాబు ఒప్పుకున్నాడు.

 

 

ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాలో తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పడంతో ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా జగపతి బాబు ఇంకా చెబుతూ.. సుకుమార్ లాంటి డైరెక్టర్ తో నటించడంతో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఇంతకీ జగపతిబాబు విలన్ రోల్ కా? లేక మరేదైనా ముఖ్య పాత్ర లో చేస్తున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version